News November 22, 2024
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం ఎస్పీ
పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పర్యవసనాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాల నివారణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News December 3, 2024
పేరెంట్ -టీచర్ మీటింగ్ పండుగలా జరగాలి: కలెక్టర్
ఈనెల 7వ తేదీన జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.
News December 3, 2024
ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత: ప్రకాశం SP
సమాజంలోని సామాన్య ప్రజలు, వివిధ రకాల కారణాలతో వచ్చే బాధితుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల అర్జీలను పోలీసు ఉన్నదాధికారులు స్వయంగా స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
News December 2, 2024
ప్రకాశం: ‘ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.