News April 4, 2025

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: వనపర్తి జిల్లా ఎస్పీ

image

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. పెద్దమందడి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై పెబ్బేరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన యుగంధర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని పోలీసులకు సూచించారు.

Similar News

News October 21, 2025

5,800 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

image

రైల్వేలో 5,800 నాన్ టెక్నికల్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హతతో 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసైన18 నుంచి 30 ఏళ్లు గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి నవంబర్ 27వరకు దరఖాస్తు చేయవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News October 21, 2025

HYD: పోలీస్ శాఖలో ‘టైగర్ జిందా హై’!

image

నిజాయితీ, అంకితభావంతో పనిచేసిన IPSలో KS వ్యాస్ ఒకరు. ASPగా కెరీర్ ప్రారంభించిన ఆయన నిజామాబాద్, నల్గొండ, విజయవాడలో SPగా పనిచేశారు. HYD ట్రాఫిక్‌లో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. మావోయిస్టుల అణచివేత కోసం గ్రేహౌండ్స్‌ను స్థాపించారు. KS వ్యాస్‌ మీద కక్ష పెంచుకున్న నక్సల్స్ జనవరి 27, 1993న LB స్టేడియంలో కాల్చిచంపారు. కానీ, ఒక సీన్సియర్ IPS ఆఫీసర్‌గా పోలీస్ శాఖలో నేటికీ సజీవంగా ఉన్నారు.‘టైగర్ జిందా హై’!

News October 21, 2025

రసంపీల్చే పురుగుల కట్టడికి జిగురు అట్టలు

image

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్‌ త్రిప్స్‌.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.