News April 4, 2025
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: వనపర్తి జిల్లా ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. పెద్దమందడి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై పెబ్బేరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన యుగంధర్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని పోలీసులకు సూచించారు.
Similar News
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ఎన్టీఆర్: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్- ల్యాండ్స్, జూనియర్ లైవిలీహుడ్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు శనివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలని ఆయన సూచించారు.
News April 20, 2025
ముస్తాబాద్: రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్సీ

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వర్షాలతో నష్టపోయిన పంటలను శనివారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన పంటలను, మామిడి తోటలను పరిశీలించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి బాధిత రైతులను ఆదుకోవాలన్నారు.