News February 25, 2025

పోలీసులు నేత్రాలను సంరక్షించుకోవాలి: ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి

image

పోలీసులకు కంటి చూపు చాలా ముఖ్యమని,కళ్లపై శ్రద్ధ వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరానికి చెందిన ఓ కంటి ఆసుపత్రి నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బందికి కంటి చూపు పరీక్షలు ఎస్పీ కార్యాలయంలో జరిగాయి. మానవ శరీరంలో కళ్లు అనే అవయవాలు చాలా ప్రధానమైనవని చెప్పారు. మన నేత్రాలను పరిరక్షించుకుని బాధ్యత వహించాలని అన్నారు.

Similar News

News February 25, 2025

మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్‌లో హరిపురం యువకుడి సత్తా

image

మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్‌లో మందస మండలం హరిపురం యువకుడు కొండ అవినాశ్ సత్తా చాటి అందరి దృష్టి ఆకర్షించాడు. హరిపురంలోని ఏవన్ ఫిట్నెస్ జిమ్ తరుఫున కొండ అవినాశ్ ఇటీవల ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నాడు. 27 ఏళ్ల యువకుడు అవినాశ్ బాడీ బిల్డింగ్‌లో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు.

News February 25, 2025

టెక్కలి: దూరవిద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2025 ఏడాదికి గాను దరఖాస్తులు కోరుతున్నట్లు నౌపడ ఆర్ ఎస్ సమీపంలోని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంబీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దూరవిద్య కేంద్రంలో సంప్రదించాలని కోరారు.

News February 24, 2025

చౌకుపేటలో వివాహిత ఆత్మహత్య

image

సోంపేట మండలం చౌకుపేట గ్రామంలో సోమవారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కౌసల్య రౌలో (30) కుటుంబ సమస్యలు తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బారువా ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!