News March 24, 2025
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి: ఎస్పీ కిరణ్ ఖరే

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్‌లో 21 మంది ఆర్జీదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 22, 2025
మంత్రి ఆనం రేపటి పర్యటనా వివరాలు

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం జిల్లా పరిధిలో పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, దేవాలయ ప్రాంగణంలో అనివేటి మండపం నిర్మాణానికి వెంకటగిరి MLAతో కలిసి పాల్గొననున్నారు.
News November 22, 2025
ములుగు: ఎస్పీ కేకన్‌ను కలిసిన ఓఎస్డీ శివమ్

ములుగు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌ను, ఓఎస్డీ శివమ్ ఉపాధ్యాయ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ఆయా సర్కిళ్ల సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సమావేశమైన ఎస్పీ, జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
News November 22, 2025
టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తుఫైల్ అహ్మద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.


