News March 25, 2025
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి: ఎస్పీ కిరణ్ ఖరే

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్లో 21 మంది ఆర్జీదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 1, 2025
HYD: మెగా జలమండలి.. DPRపై ఫుల్ ఫోకస్

గ్రేటర్ HYD సహా వివిధ ప్రాంతాలకు విస్తరించి ఉన్న జలమండలి ఇప్పుడు మరింత విస్తరణకు శ్రీకారం చుట్టింది. DPR సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు.1450.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జలమండలి మరో 603 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా జలమండలిగా తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ సిద్ధమవుతోంది.
News December 1, 2025
‘సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి’

పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంగా వీర తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని, పోరాట చరిత్రకు సాక్షిగా నిలబడ్డ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలని ఎంసీపీఐయూ జిల్లా నాయకులు అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వర్గ సభ్యులు వెంకన్న, నజీర్ మాట్లాడుతూ.. పాతికేళ్ల పార్లమెంటరీ ఉద్యమ సారథిగా బీఎన్ రాష్ట్రపతి అవార్డు పొందారన్నారు.