News February 13, 2025

పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలి: పీటీసీ ప్రిన్సిపల్

image

పోలీసులు విధి నిర్వహణలోని మంచి పేరు తెచ్చుకోవాలని మామునూర్ పీటీసీ ప్రిన్సిపల్ పూజ అన్నారు. బుధవారం మామునూర్ క్యాంప్‌లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన 256 కానిస్టేబుళ్ల శిక్షణకు పూజ హాజరై మాట్లాడారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం విధి నిర్వహణలో తోడ్పాటు కాగలదని, చెప్పారు. డీఎస్పీలు రమేష్, వేంకటేశ్వర రావు, రవీందర్, పాండునాయక్, పీఆర్‌ఓ రామాచారి పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,300 పలకగా.. నేడు రూ.14,000కి పెరిగింది. అలాగే 341 మిర్చికి నిన్న రూ.13,550 ధర రాగా.. ఈరోజు రూ.13,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.14,700 ధర రాగా.. ఈరోజు భారీగా పెరిగి రూ.16వేలకి ఎగబాకింది.

News February 13, 2025

WGL: భారీగా పతనమవుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.6,900కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.

News February 13, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాస గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

error: Content is protected !!