News June 15, 2024
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల వివరాలు

పట్టుబడిన మావోయిస్టుల వివరాలు:
1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్.
2) సోడి కోసి @ మోతే D/o అడమాలు . పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు,
3) సోడి విజయ్ @ ఇడుమ S/o జోగ, 1 బెటాలియన్ సభ్యుడు,
4) కుడం దస్రు S/o గంగ, మిలిషియా సభ్యుడు
5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు
6) మడకం భీమ S/o కోస, మిలిషియా సభ్యుడు.
Similar News
News November 30, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News November 30, 2025
పర్వతగిరి: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పరిశీలన..!

స్థానిక సంస్థల ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ కమిషనర్ బాలమాయ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి దశను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఇండస్ట్రియల్ జీఎం నరసింహమూర్తి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.
News November 30, 2025
వరంగల్: వైన్స్ బంద్.. ఇబ్బందుల్లో మందుబాబులు..!

మద్యం దుకాణాలకు నేటితో గడువు ముగుస్తున్నందున గత మూడు రోజులుగా దుకాణాలకు ప్రభుత్వం మద్యం సరఫరాను నిలిపివేసింది. కాగా, రేపటి నుంచి కొత్త షాపులు ప్రారంభం కానుండగా, అధికశాతం షాపులు పాత అడ్డాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. స్టాక్ లేకపోవడం, నూతన షాపుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో జిల్లాలో వైన్ షాపులు బంద్ చేశారు. దీంతో మద్యం దొరకక మందుబాబులు విలవిల్లాడుతూ బెల్టు షాపులకు పరుగులు పెడుతున్నారు.


