News April 10, 2025
పోలీసుల అదుపులో ఐటీడీపీ కార్యకర్త కిరణ్

YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ను అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించి, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
ఆదిలాబాద్: ఆర్టీసీలో ఉద్యోగాలు.. APPLY NOW

ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆదిలాబాద్ జిల్లాలో 21, మంచిర్యాల జిల్లాలో 24, నిర్మల్లో 21, ఆసిఫాబాద్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు అప్లై చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
SHARE IT
News September 18, 2025
జనగామ ఆర్టీసీలో నియామకాలు

RTC ఖాళీల భర్తీకి TS పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనగామ జిల్లాకు 19 డ్రైవర్, 2 శ్రామిక్ పోస్టులు కేటాయించింది. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.