News March 26, 2025
పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు.
Similar News
News April 2, 2025
అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

అనంతపురం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో, రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది.