News March 14, 2025
పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.
Similar News
News March 19, 2025
వైసీపీ హయాంలో అక్రమాలపై విచారణ చేస్తాం: అచ్చెన్న

అవినీతి కోసమే పథకం అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాహనాల కొనగోళ్లు, నిర్వహణలో తప్పులు జరిగాయని తెలిపారు. వీటిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాని పేర్కొన్నారు. నివేదిక సంతృప్తిగా లేకుంటే మరో ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.
News March 19, 2025
విశాఖ: చిన్న శ్రీను కుమారుడి మృతి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.
News March 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.