News November 5, 2024
పోలీసుల గౌరవం పెంచడానికి ప్రభుత్వం కృషి: హోం మంత్రి
రాష్ట్రంలో పోలీసుల గౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో డీఎస్పీల పాసింగ్ అవుట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు వ్యవస్థపై గురుతర బాధ్యత ఉన్నదని, అందరూ సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
Similar News
News December 11, 2024
గార్లదిన్నె మండలంలో బాలికపై అత్యాచారం
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో దారుణ ఘటన జరిగింది. బాలికపై వంశీ అనే వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి వరకు చదివిన బాలిక పొలం పనులకు వెళ్తోంది. కూలీలను పొలానికి తీసుకెళ్లే డ్రైవర్‌కు బాలికతో పరిచయం ఏర్పడంది. మాయమాటలతో అత్యాచారం చేశాడు. కడుపు నొప్పిగా ఉందని బాలిక పామిడి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా ఏడు నెలల గర్భిణి అని తేలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News December 11, 2024
విజయవాడకు వెళ్లిన అనంత, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
News December 11, 2024
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు: కలెక్టర్
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ విడుదల చేశారు. సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. జిల్లాస్థాయిలో మైనర్ ఇరిగేషన్ సంఘాలు 214, మీడియం ఇరిగేషన్ సంఘాలు 16.. మొత్తం 230 ఉన్నాయని తెలిపారు. ఈనెల 14న సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.