News April 11, 2025
పోలీసుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
Similar News
News December 9, 2025
VZM: జిల్లాలోని ఆప్కో దుకాణాల్లో పండగ ఆఫర్లు

క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సాహించాలన్నారు.
News December 9, 2025
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ నలుగురికి జైలుశిక్ష: VZM SP

విజయనగరం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపర్చగా.. ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి 20, 15, 6, 5 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఆకస్మిక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ దామోదర్ చెప్పారు.
News December 9, 2025
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హమీ పథకం కీలకం: మంత్రి కొండపల్లి

MGNREGS పనుల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఛాంబర్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం కీలకమని ఆయన పేర్కొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్థితిని అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పీడీ శారదాదేవి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రత్నకుమార్, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


