News September 26, 2024
పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Similar News
News October 29, 2025
శ్రీకాకుళం: పొలాల్లో వాన నీరు..రైతు కంట కన్నీరు

‘మొంథా’ తుపాన్ ప్రభావానికి భారీ వర్షాలు, ఈదురు గాలులకు శ్రీకాకుళం జిల్లాలోని 2,230.29 హెక్టారాల్లో పంట నష్టం సంభవించింది. ఈ విపత్తుతో 4,801 మంది రైతులు నష్టపోయారు. వరి 2,227.5 హెక్టార్లు, ఉద్యాన పంటలు 2.79 హెక్టార్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఇచ్ఛాపురం 1,118 హెక్టార్లలో వరికి నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారు. పొలాల్లో నీటిని మళ్లించి, సాగును కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.
News October 29, 2025
ఎచ్చెర్ల: నేడు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు

మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎచ్చెర్ల డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి బుధవారం కూడా సెలవును పొడిగించారు. జిల్లాలో వర్షాలు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీతో పాటు జిల్లాలో అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బీ.అడ్డయ్య మంగళవారం వెల్లడించారు. తుఫాన్ నేపథ్యంలో విద్యార్థులు భద్రత దృష్ట్యా సెలవును ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News October 29, 2025
అక్టోబర్, నవంబర్ నెలల్లో సిక్కోలును వణికించిన తుఫాన్లు ఇవే..!

1968 నవంబర్లో వచ్చిన భారీ తుఫాన్ ఉద్దానంతో పాటు జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబరులో 180 కిమీ వేగంతో వీచిన గాలులు తుఫాన్తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్లోన్లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013నీలం, పైలాన్ తుఫాన్లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్ హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.


