News September 26, 2024
పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ
జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Similar News
News October 13, 2024
ముగిసిన సెలవులు.. రేపటి నుంచే స్కూల్స్, కాలేజీలు
శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి పాఠశాలు, ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వగా నేటితో ముగిశాయి. అలాగే మరో పక్క జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు ఈనెల 7వ తేదీ నుంచి సెలవులు ప్రకటించగా నేటితో ముగియనున్నాయి. దీనితో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.
News October 13, 2024
లావేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
లావేరు మండలం కేశవరాయనిపాలెం పంచాయతీ హనుమయ్యపేట గ్రామానికి చెందిన నాయిని చంటి (26) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న మురపాకు టిఫిన్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. భర్త మృతి చెందడంతో భార్య భవాని ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భవాని మూడు నెలల గర్భవతి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News October 13, 2024
టెక్కలి: వారంలో కుమార్తె పెళ్లి.. యాక్సిడెంట్‌లో తండ్రి మృతి
టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన రుంకు మోహనరావు(55) అనే వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈనెల 20వ తేదీన తన కుమార్తె హిమ వివాహం నేపథ్యంలో పెళ్లి పిలుపులకు సైకిల్‌పై వెళ్తుండగా టెక్కలి జాతీయ రహదారిపై విక్రంపురం గ్రామం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.