News December 6, 2024
‘పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి విధులు నిర్వర్తిద్దాం’

అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. 1940 దశకంలో వలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీసుశాఖలో కీలకంగా ఉందన్నారు.
Similar News
News January 12, 2026
అక్షర ఆంధ్రను విజయవంతం చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

జిల్లాలో ఉల్లాస్ ఫేజ్-2 అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. 2025-26లో జిల్లాలో 15-59 ఏళ్ల మధ్య వయస్సు గల 1,25,578 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి వయోజనుడికి 100 గంటల బోధనతో చదవడం, రాయడం, న్యూమరసీ, డిజిటల్ లిటరసీపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
News January 12, 2026
‘ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి’

ఈ నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, పలు సూచనలు జారీ చేశారు. జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News January 12, 2026
అనంతపురం జిల్లా JC బదిలీ

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


