News December 24, 2024
పోలీసు అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీస్ అధికారులను మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. అనంతరం పోలీస్ అధికారులకు సీపీ రివార్డులను అందజేశారు. 2019 SEP 10న పెనుబల్లి పోలీస్ స్టేషన్ పరిధి బ్రహ్మాళకుంటలో హత్య జరిగింది. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా, ఒకరికి ఐదేళ్ల జైలుశిక్ష రూ.5వేల జరిమానా పడేలా పోలీస్ అధికారులు కృషి చేశారని సీపీ పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
ఖమ్మం: బట్టిపట్టే చదువుకు స్వస్తి – ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం

ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజూ గంటసేపు రీడింగ్ స్కిల్స్ అభ్యాసం చేయించాలని సూచించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.
News October 30, 2025
నిబంధనలకు లోబడే లేఔట్ అనుమతులు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన లేఔట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడారు. నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించి మాత్రమే లేఔట్ అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ప్రాంతంలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, సీవరేజ్, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. లేఔట్ అనుమతులు పారదర్శకంగా ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
News October 30, 2025
మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం: మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 28 అడుగుల మార్కును దాటడంతో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం కలెక్టర్, సీపీతో కలిసి నదిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగిన సమీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


