News December 24, 2024

పోలీసు అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

image

హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీస్ అధికారులను మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. అనంతరం పోలీస్ అధికారులకు సీపీ రివార్డులను అందజేశారు. 2019 SEP 10న పెనుబల్లి పోలీస్ స్టేషన్ పరిధి బ్రహ్మాళకుంటలో హత్య జరిగింది. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా, ఒకరికి ఐదేళ్ల జైలుశిక్ష రూ.5వేల జరిమానా పడేలా పోలీస్ అధికారులు కృషి చేశారని సీపీ పేర్కొన్నారు.

Similar News

News January 24, 2025

అద్దె ఇంట్లో ఉన్నవారు అనర్హులని అనడం దారుణం: బీజేపీ

image

జూలూరుపాడు: అద్దె ఇంట్లో ఉన్న వారిని ప్రభుత్వం అనర్హులని తేల్చడం దారుణమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News January 24, 2025

ఖమ్మం: గ్రామసభల ఆప్డేట్ 

image

ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీలలో మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్‌లో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామసభల వద్ద జనం బారులు తీరారు. సభలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులపై మరింత స్పష్టత రానుంది.

News January 24, 2025

వేసవిలో నిరంతర విద్యుత్‌కు చర్యలు: Dy.CM భట్టి

image

రానున్న వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ప్రజాభవన్‌లో విద్యుత్ అధికారులతో నిర్వహించిన 2025 యాక్షన్ ప్లాన్‌లో Dy.CM మాట్లాడారు. జిల్లా, మండల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఆ విధంగా సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.