News October 19, 2024
పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం-ఎస్పీ

విధినిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కడప పోలీస్ పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలు, కారుణ్య నియామకాల గురించి, కుటుంబ స్థితిగతులు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 9, 2025
ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా: కడప ఎస్పీ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్, రాజకీయ సున్నిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పులివెందుల సబ్ డివిజన్ అధికారులతో కడపలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జీఎంఎస్‌కేలతో కలిసి గ్రామాల్లో గస్తీ పెంచాలని సూచించారు.
News December 9, 2025
కడపలో గంజాయి, అసాంఘిక శక్తులపై డ్రోన్ నిఘా

కడప నగరంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తారకరామా నగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి జల్లెడ పట్టారు. గంజాయి, బహిరంగ మద్యపానం చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 9, 2025
కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.


