News October 19, 2024
పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం-ఎస్పీ
విధినిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కడప పోలీస్ పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలు, కారుణ్య నియామకాల గురించి, కుటుంబ స్థితిగతులు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 5, 2024
కడప శివాలయంలో MLA మాధవి పూజలు
కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా కడప MLA మాధవి శివున్ని దర్శించుకున్నారు. కడపలోని మృత్యుంజయ కుంటలో వెలిసిన శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా తోటి భక్తులతో కలిసి సామాన్యురాలిగా కార్తీక దీపాలను వెలిగించి ఆమె మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు.
News November 4, 2024
ఆర్మీ ర్యాలీకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ఈ నెల 10వ తేదీ నుంచి కడపలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మనోజ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి కడప కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చేసి అభ్యర్థులకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. రైన్ ప్రూఫ్ టెంట్స్, రన్నింగ్, ఇతర పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 4, 2024
కడప: ‘అర్జీదారులు సంతృప్తి పడేలా చూడాలి’
కడప జిల్లాలోని సుదూర ప్రాంత ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని, కాబట్టి వారు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు అర్జీలను బదిలీ చేస్తూ పరిష్కరించాలన్నారు.