News October 22, 2024
పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: ప్రకాశం ఎస్పీ

విధినిర్వహణలో, అసాంఘిక శక్తుల చేతిలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది సంక్షేమ కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధినిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశమయ్యారు. విధినిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 15, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025