News December 16, 2024
పోలీసు నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: దువ్వాడ
టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు దువ్వాడకు 41ఏ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. నోటీసులపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని దువ్వాడ అన్నారు. రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని అన్నారు. అధికారంలో ఉన్నపుడు తాను అవినీతి చేయలేదన్నారు.
Similar News
News January 19, 2025
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట జంక్షన్ సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిరమండలం కొండరాగోలుకు చెందిన సన్నబోయిన చంద్రశేఖర్(25) అనే యువకుడు మృతి చెందినట్లు సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి తెలిపారు. ఆమదాలవలసలోని స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
News January 19, 2025
శ్రీకాకుళం జిల్లాలో పెరిగిన చలితీవ్రత
శ్రీకాకుళం జిల్లాలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో పాటు మంచు అధికంగా కురుస్తుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా చలికి వణుకుతున్నారు. జిల్లాలోని టెక్కలి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు, గార మండలాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి, వేకువజాము సమయాల్లో చలిమంటలు వేస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.
News January 18, 2025
శ్రీకాకుళం: నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు హాజరైనట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పరసరామయ్య తెలిపారు. వీరిలో బాలురు 3845 మంది, బాలికలు 3402 మంది హాజరయ్యారు. జిల్లాలో 32 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1043 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు.