News October 21, 2024
పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి

కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలిని అర్పించారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, హన్మకొండ, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఖమ్మం డీవైఎస్‌వో సునీల్ రెడ్డి తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుండి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు 96036 49969 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News February 25, 2026
ఖమ్మంలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతం

ఖమ్మం జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1కు 18,258 మందిలో 17,667 మంది హాజరయ్యారు. గాంధీచౌక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగాయని, ఎలాంటి అక్రమాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News February 25, 2026
ఖమ్మంలో డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ రూ.13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ రూ.10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


