News October 2, 2024
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
Similar News
News December 8, 2025
వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
News December 8, 2025
పోలింగ్ రోజున వరంగల్లో స్థానిక సెలవులు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
News December 8, 2025
వ్యవసాయ శాఖపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

వరంగల్ కలెక్టరేట్లో వ్యవసాయ శాఖపై కలెక్టర్ డా.సత్య శారద సమీక్ష నిర్వహించారు. యాసంగి 2025-26కి అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.


