News January 24, 2025
పోలీస్ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న డిస్ట్రిక్ పోలీస్ మీట్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా పోలీసులు శాంతి భద్రత పర్యవేక్షణలో ముందున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రామ్నాథ్ కేకన్, పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. కారణం ఇదే

AP: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించి కీలక విషయాలు వెల్లడించారు. ‘బంక్లో పెట్రోలు పోయించాక బండిని శివశంకర్ నడిపాడు. బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు డివైడర్ను ఢీకొట్టింది. శివశంకర్ స్పాట్లో చనిపోయాడు. దీంతో గాయపడ్డ ఎర్రిస్వామి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోడ్డుపై ఉన్న బైక్ని బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది’ అని తెలిపారు.
News October 25, 2025
70 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(NSIC) 70 మేనేజర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. డిగ్రీ, MBA, CA, CMA, BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 27 నుంచి NOV 16 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,500. SC, ST, PWBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వెబ్సైట్: https://nsic.co.in.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 25, 2025
‘నిందితులకు శిక్ష పడేలా చేయడమే కోర్టు మానిటరింగ్ సెల్ లక్ష్యం’

సకాలంలో కోర్టుల్లో సాక్షులను ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడే విధంగా చేయడమే కోర్టు మానిటరింగ్ సెల్ లక్ష్యమని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు మానిటరింగ్ సెల్ జిల్లా సభ్యులతో ఆయన రివ్యూ నిర్వహించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.


