News December 30, 2024
పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు: ఎస్పీ
నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో, రహదారులపై వేడుకల నిర్వహణకు అనుమతులు లేవన్నారు.
Similar News
News January 24, 2025
పెండింగ్ పనులను పరిష్కరించండి: కలెక్టర్ చేతన్
శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారులకు సంబంధించి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రైల్వేలు, అటవీశాఖ, చిన్న నీటిపారుదలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ సమస్యలను వారంలోపు పరిష్కరించాలని ఆదేశించారు.
News January 23, 2025
రొళ్లలో యువకునిపై పోక్సో కేసు
రొళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలాజీ తెలిపారు.17 ఏళ్ల వయసున్న బాలిక ఈనెల 2వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు బాలిక తల్లిదండ్రులు 4వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో ఉండగా బుధవారం సాయంత్రం బాలిక ఇంటికి చేరుకొని కిరణ్ అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News January 23, 2025
సోమందేపల్లి: బంగారమని చెప్పి భారీ మోసం
నకిలీ నగలను బంగారమని చెప్పి అమ్మి మోసం చేసే ముఠాను సోమందేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు.. పొలాన్ని దున్నుతుంటే బంగారు హారాలు లభ్యమయ్యాయని, తక్కువకే ఇస్తామని ఇద్దరిని మోసం చేశారని తెలిపారు. వారి ఫిర్యాదుతో హిందూపురం – పెనుకొండ వైపుకు వస్తుండగా 10 మందిని పట్టుకోగా..నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ. రూ.21 లక్షలు, 5 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.