News March 11, 2025
పోలీస్ పిజిఆర్ఎస్ కు 122 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట వద్ద ఉన్న సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
Similar News
News May 7, 2025
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కర్నూలు కలెక్టర్

విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.
News May 7, 2025
అవయవ దానంతో పునర్జన్మను ఇవ్వొచ్చు: కలెక్టర్

అవయవదానం మానవతా కోణంతో చేసే ఒక గొప్ప పనని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఓ హాస్పిటల్లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవదానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణని తెలిపారు. అనంతరం వైద్యులను కలెక్టర్ సన్మానించారు.
News May 7, 2025
హాలహర్విలో వైసీపీ నాయకుడి హత్య

హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన సాయంత్రం మృతదేహమై కనిపించాడు. కుటుంబీకుల సమాచారంతో సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.