News March 7, 2025
పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి: ఎస్పీ రత్న

విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం, నూతన టెక్నాలజీతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నం పేర్కొన్నారు. జిల్లాకు కేటాయించిన ప్రొబేషనరీ ఎస్ఐలతో గురువారం కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 4నెలలపాటు గ్రేహౌండ్స్ శిక్షణలో బేసిక్ పోలీసింగ్ విధానం గురించి పూర్తిస్థాయిలో ప్రతి అంశాన్ని తెలుసుకోవాలన్నారు.
Similar News
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.
News November 27, 2025
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.
News November 27, 2025
అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం శారదానగర్‌లో గురువారం దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్య అమూల్య తన 3 ఏళ్ల కుమారుడు సహస్రను గొంతు కోసి, తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇరువురు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


