News January 25, 2025
పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

హోంగార్డుల విధులు పోలీస్ శాఖలో ఎంతో కీలకమని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన హోంగార్డు నరసయ్య కుటుంబ సభ్యులను వారు సత్కరించారు. పదవి విరమణ చేసిన హోంగార్డులు సేవలను డిపార్ట్మెంట్ పరంగా ఎప్పుడు అవసరం వచ్చినా వినియోగించుకుంటామన్నారు. వారికి సంబంధించి పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని అన్నారు. హోంగార్డు ఆర్ఐ కృష్ణ, పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
విశాఖ-కాకినాడ-భీమిలి నుంచి క్రూయిజ్ టూరిజంపై చర్చ

కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమిలి పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి చూపింది.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <


