News September 7, 2024

పోలీస్ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: ఎస్పీ

image

నంద్యాల జిల్లా పోలీస్ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహణ చేస్తానని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో విభాగాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారి సమస్యలను తెలుసుకున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఐ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News October 9, 2024

పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ అభినందన

image

రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.

News October 9, 2024

బన్ని ఉత్సవాలకు పోలీసు బందోబస్తు: ఎస్పీ

image

12న జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలకు 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు విధుల్లో ఉంటారన్నారు.

News October 9, 2024

‘సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించండి’

image

సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వచ్చినందున ఉమ్మడి కర్నూలు జిల్లాలోని KC కెనాల్, తుంగభద్ర LLC, హంద్రీనీవా వంటి నీటి సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయని, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు నాంది కావాలన్నారు.