News April 6, 2025

పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్‌పై లెర్నింగ్ నిర్వహించిన సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ పై సీపీ శంఖబ్రత బాగ్చి అవగాహనా కల్పించారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అవగాహనా కల్పించారు. ప్రతి పోలీసు కుటుంబానికి మెడికల్ భద్రత అవసరమన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24/7 పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెల్ ద్వారా ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను పోలీస్ ఇన్సూరెన్స్ సెల్ చూసుకుంటుందన్నారు.

Similar News

News April 17, 2025

గాజువాక యువకుడిని కాపాడిన పోలీసులు

image

గాజువాకకు చెందిన సన్యాసినాయుడు రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు రక్షించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సన్యాసినాయుడు రాజమండ్రిలో పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నాడు. కాగా బెట్టింగులకు బానిసై రూ.50వేలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బుధవారం రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద గోదావరిలో దూకాడు. అది గమనించిన పోలీసులు స్థానికుల సాయంతో యువకుడిని కాపాడారు.

News April 17, 2025

విశాఖలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్

image

విశాఖలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగటి పూటే ఇంట్లోకి చొరబడి దొచుకుంటున్నారు. మద్దిలపాలెంలో మంగళవారం సాయంత్రం అద్దె ఇంటికోసం అని వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన మర్చిపోకముందే MVP కాలనీలో బుధవారం సాయంత్రం మరో ఘటన జరిగింది. MVP సెక్టార్-8లో లలిత అనే వృద్ధురాలి మెడలో గొలుసు తెంపుకొని ఓ దుండగుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో MVP పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 17, 2025

విశాఖ: సమతా ఎక్స్ ప్రెస్ రద్దు

image

నాగపూర్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ- నిజాముద్దిన్ సమతా ఎక్స్‌ప్రెస్ (12807/12808) ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.

error: Content is protected !!