News March 12, 2025
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్‌లను జిల్లా ఎస్పీ అందజేశారు.
Similar News
News September 15, 2025
అనకాపల్లి పోలీస్ ప్రజావేదికలో 40 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు 40 ఫిర్యాదులను అందజేశారు. ఎస్పీ తుహీన్ సిన్హా ఫిర్యాదారులతో మాట్లాడారు. 23 భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు, నాలుగు కుటుంబ కలహాల ఫిర్యాదులు, మోసాలకు సంబంధించినవి మూడు, ఇతర విభాగాలకు చెందినవి 10 ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీటిపై విచారణ నిర్వహించి వారం రోజుల లోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు
News September 15, 2025
భారత్-పాక్ మ్యాచ్.. ICCకి PCB ఫిర్యాదు

భారత్, పాక్ మధ్య నిన్నటి మ్యాచ్‌లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తీరును ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తి రూల్స్ ఉల్లంఘించారని, తక్షణమే టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించడంలో ఆలస్యం చేశారని తమ డైరెక్టర్ ఉస్మాన్‌ను సస్పెండ్ చేసింది. టాస్ సమయంలో IND కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌కు రిఫరీ చెప్పారని PCB ఆరోపిస్తోంది.
News September 15, 2025
జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.