News August 1, 2024

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

image

పోలీస్ సిబ్బందికి సంబంధించిన అన్ని రికార్డులను డీపీఓ కార్యాలయంలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని డీపీఓ కార్యాలయంలో సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News January 19, 2026

ప్రకాశం: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27 నుంచి జరగనున్న ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న పబ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సందేహాలకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్ఐఓకు ఆదేశాలు జారీ చేశారు.

News January 19, 2026

ఒంగోలులో యోగి వేమన జయంతి వేడుకలు

image

ఒంగోలు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో విశ్వకవి యోగివేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలక్రిష్ణలు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగివేమన తన పద్యం ద్వారా నీతిని సమాజానికి చాటి చెప్పారన్నారు.

News January 18, 2026

ప్రకాశం: ఫుల్‌గా తాగేశారు..!

image

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.