News March 8, 2025

పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారికి సరైన న్యాయం చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులతో ఎస్పీ నారాయణరెడ్డి ప్రజా దర్బార్ నుంచి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. హోంగార్డ్స్, పోలీస్ సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎస్పీ చెప్పారు.

Similar News

News February 25, 2026

AI పుణ్యమా అని పెరిగిన ఆదాయం!

image

AI వల్ల 40%కి పైగా భారతీయ ఉద్యోగుల ఆదాయం పెరిగిందని బ్యాంక్‌బజార్ నివేదిక వెల్లడించింది. 22-45 ఏళ్ల మధ్య వయస్సు గల శాలరీడ్‌లో ఈ మార్పు కనిపిస్తోంది. అయితే ఐదుగురిలో ఒకరు AI వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారతీయులు మొదటి ప్రాధాన్యం ఆరోగ్యానికి ఇస్తుండగా.. తర్వాత సొంత ఇల్లు, పిల్లల చదువును కీలకంగా భావిస్తున్నారు.

News February 25, 2026

వనపర్తి: అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

వనపర్తిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పక్కా సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. బాధితురాలికి న్యాయం జరిగినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 25, 2026

T20 WC: పాక్ సెమీస్ చేరాలంటే..

image

T20 WCలో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోయిన పాక్‌కు సెమీస్ చేరడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది శ్రీలంకపై పాక్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాలి. అప్పుడు పాక్ మూడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిస్తే శ్రీలంకపై పాక్ భారీ తేడాతో గెలిచి కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి.