News March 31, 2025

పోలీస్ స్టేషన్‌గా మారిన వికారాబాద్ RDO ఆఫీస్

image

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్‌గా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు పోలీస్ కార్యాలయంగా మార్చారు. ఆదివారం సెలవు ఉండడంతో షూటింగ్‌ కోసం అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆఫీస్‌ను ఇలా పోలీస్ స్టేషన్‌గా మార్చేశారు.

Similar News

News November 16, 2025

ఆదోని జిల్లా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి

image

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News November 16, 2025

ఇండియా-A ఘన విజయం

image

రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్‌కోట్‌లో జరగనుంది.

News November 16, 2025

సిద్దిపేట: నవంబర్ 20న జిల్లా కబడ్డీ ఎంపికలు

image

సిద్దిపేట జిల్లా జూనియర్, సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 20న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్ర క్రీడా మైదానంలో జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్ తెలిపారు. జూనియర్ బాలికలు(డిసెంబర్ 29, 2005 తర్వాత జననం – 65 కేజీల లోపు), బాలురు (జనవరి 18, 2006 తర్వాత జననం – 70 కేజీల లోపు) అర్హులని ఆయన పేర్కొన్నారు.