News March 21, 2024

పోలీస్ స్టేషన్లలో 50 నాటు తుపాకీలు అప్పగింత: ఎఎస్పీ 

image

కుక్కునూరు, కూనవరం, విఆర్ పురం, ఐ పోలవరం, చింతూరు, ఎటుపా, రాజవొమ్మంగి మండలాల్లో ఇప్పటి వరకు గిరిజనులు 50 సింగిల్ బార్ తుపాకులను వివిధ పోలీస్టేషన్లలో అందజేశారని ఎఎస్పీ జగదీష్ అన్నారు. రాజవొమ్మంగి పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారభించారు. ఆయుధాల నియంత్రణ చట్టం ప్రకారం నిషేధిత తుపాకులు కలిగి ఉండడం నేరమని, ఇకపై తుపాకీతో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 24, 2025

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

image

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు 5,214 పోలింగ్ స్టేషన్‌లు, 6,258 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులకు సుమారు14,092మంది సిబ్బంది అవసరమని గుర్తించి, శిక్షణ పూర్తి చేశారు. వీరిలో పోలీంగ్ ఆఫీసర్లు 6,258, ఓపీవోలు 7,834 మందిని నియమించారు.

News November 24, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} సత్తుపల్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

News November 24, 2025

ఖమ్మం: రిజర్వేషన్లు ఖరారు.. కలెక్టర్ గెజిట్ విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 571 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, 5214 వార్డుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లలో 260 మహిళలకు.. 311 జనరల్ స్థానాలను కేటాయించారు. అలాగే 5,214 వార్డుల్లో 2,252 మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల నివేదికను నేడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.