News March 8, 2025
పోసానిని కస్టడీకి ఇవ్వండి: ఆదోని పోలీసులు

కర్నూలు జిల్లా జైలులో ఉన్న నటుడు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ <<15653795>>ఆదోని<<>> పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ దీనిపై విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు.
Similar News
News March 24, 2025
కోడుమూరు ఘటన.. వార్డెన్ సస్పెండ్

కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి మహేశ్.. రాజు, జె.ఇసాక్ అనే స్టూడెంట్లపై భౌతికంగా దాడికి పాల్పడిన <<15871409>>వీడియో<<>> సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విచారణ అనంతరం వార్డెన్ రాముడిని సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదైంది.
News March 24, 2025
ఆదోని సబ్ కలెక్టరేట్‌లో ప్రజా గ్రీవెన్స్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా సమస్యలు తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్పీఓ నూర్జహాన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి, ఇరిగేషన్ డీఈ షఫీ ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పద్మజ పాల్గొన్నారు.
News March 24, 2025
కర్నూలు మేయర్ పీఠంపై టీడీపీ కన్ను!

కర్నూలు మేయర్ బీవై రామయ్యకు అవిశ్వాస గండం తప్పదా? ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరో ఏడాది పదవీ కాలం ఉండగా TDP అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నగర కార్పొరేషన్‌లో 52మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ బలం 22కు చేరింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 28మంది అవసరం. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.