News March 12, 2025
పోసాని నేడు విడుదలయ్యేనా?

కర్నూలు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు కర్నూలు JFCM కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జైలు నుంచి విడుదలయ్యేలోపు ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం నడుస్తోంది. కాగా ఈ నెల 4 నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.
Similar News
News March 5, 2026
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.
News March 5, 2026
ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News March 5, 2026
విందులు చేశారు.. పరిశుభ్రత మరిచారు!

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ సమీపంలో కొందరు అధికారులు విందులు చేసి, ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేశారు. ప్రతీ శనివారం పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించే కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఇలా చేయడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


