News November 14, 2024

పోసాని మురళీకృష్ణపై పాతపట్నంలో కలమట ఫిర్యాదు

image

సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాతపట్నం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. మురళీకృష్ణ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, టీటీడీ అధ్యక్షులు బిఆర్ నాయుడుతో పాటు పలు సంస్థల అధినేతలపైన తప్పుగా మాట్లాడినందుకు ఫిర్యాదు చేసినట్లు కలమట తెలిపారు. ఫిర్యాదును ఎస్ఐ లావణ్యకు అందజేశారు. టీడీపీ నాయకులు ఉన్నారు.

Similar News

News December 3, 2024

శ్రీకాకుళం: ఈ నెల 9 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం

image

శ్రీకాకుళంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముసాయిదా ఓటర్లు డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించినన్నారు. అనంతరం మార్పులు, చేర్పులకు ఈనెల 9వ తేదీన www.coeandhra.nic.in వెబ్‌సైట్‌లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని సంప్రదించి దరఖాస్తులను సమర్పించవచ్చు.

News December 2, 2024

SKLM: గంజాయి వ్యాపారుల ఆస్తులను జప్తు చేస్తాం: DIG

image

గంజాయి కేసుల్లో ఇటీవల అరెస్టు అయిన నిందితులు, వారు గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన ఆస్తులను గుర్తించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి జూమ్‌లో వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన విశాఖ రేంజ్ పరిధిలోని ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. నిందితుల పేరున గుర్తించిన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

News December 2, 2024

SKLM: ఎస్పీ స్పందనకు 50 అర్జీలు

image

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు 50 అర్జీలు అందించారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.