News May 4, 2024

పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ ఎస్.షణ్మోహన్

image

ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది వారి ఓటు హక్కును 5, 6వ తేదీలలో వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

Similar News

News November 2, 2025

చిత్తూరు: ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

image

చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ వెంకటరమణ కోరారు. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సైట్ ఇంజినీర్ పోస్టులు 3, డ్రాఫ్ట్ మెన్ పోస్టులు రెండింటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని.. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News November 2, 2025

పుత్తూరు: ‘ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట’

image

కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో ఆయన శనివారం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద 9 మంది తొక్కిసాలాటలో మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి సామాన్య ప్రజలకు, భక్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.

News November 1, 2025

కుప్పం: మెడికో ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా..?

image

కుప్పం మెడికల్ కళాశాలలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ (24) మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. పీజీ అనస్తీషియా చేస్తున్న హర్షవర్ధన్ ఉదయం ఆసుపత్రిలో ఓ సర్జరీ కేసు చూసుకుని మధ్యాహ్నం లంచ్ సమయంలో హాస్టల్ గదిలోకి వెళ్లి హై డోస్ ఇంజక్షన్ వేసుకోవడంతో కార్డియాక్ అరెస్టై మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు నంద్యాల జిల్లా డోన్ కు చెందిన నాగరాజు కుమారుడు హర్షవర్ధన్‌గా సమాచారం.