News May 5, 2024
పోస్టల్ బ్యాలెట్లపై ప్రధాన పార్టీల గురి

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించకునేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రక్రియ జరగనుంది. ఓటర్లు తమ ఫెసిలిటేషన్ సెంటరులోనే ఓటు హక్కు వినియోగించుకోవాల్సివుంది . ఈ క్రమంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.