News February 12, 2025

పోస్టుమార్టం నిర్వహణ పటిష్ఠంగా జరగాలి : వరంగల్ కలెక్టర్

image

వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం కేంద్ర నిర్వహణ పటిష్ఠంగా జరిగేలా దానికి తగిన అన్నిచర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శవ పరీక్షల నిర్వహణపై జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద దిశా నిర్దేశం చేశారు. శవాల పోస్టుమార్టం సకాలంలో జరగాలని, పోస్టుమార్టం చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 30, 2025

‘సర్’పై వార్.. రేపటి నుంచి పార్లమెంట్

image

శీతాకాలంలో వాడీవేడీ వాదనలకు పార్లమెంట్ సిద్ధమైంది. రేపటి నుంచి DEC 19 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR)పై కీలక చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. చర్చించాల్సిన అంశాల అజెండాలను ఖరారు చేయనుంది. సభలో పాటించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రేపు 10AMకు ఇండీ కూటమి నేతలు ఖర్గే నివాసంలో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

News November 30, 2025

మార్కాపురం జిల్లా.. కొత్తగా మరికొన్ని డిమాండ్‌లు

image

మార్కాపురం జిల్లా పశ్చిమ ప్రకాశం ప్రజల ఏళ్ల నాటి కల. అది సాకారమయ్యే వేళ ప్రజలు మరికొన్ని అంశాలను తెరపైకి తెస్తున్నారు. మార్కాపురం జిల్లాకు కాటమరాజు పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దొనకొండ, కురిచేడు మండలాలను కూడా మార్కాపురంలో కలిపితేనే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు గిద్దలూరును కనిగిరి డివిజన్‌లో కలపడంపై అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News November 30, 2025

కరీంనగర్: సర్పంచ్ అభ్యర్థుల్లో వణుకు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో Gen-Z యువత ప్రధాన భూమిక పోషిస్తోంది. గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో సమస్యలు, మేనిఫెస్టో, ఓటుకు నోటు వంటి అంశాలపై ఆశావాహులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పోస్టులతో యువత ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో, వాట్సాప్‌లో పోస్ట్ చేయాలంటేనే సర్పంచ్ అభ్యర్థులు వణికిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1224 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి.