News April 28, 2024
పౌరుడి చేతిలో బ్రహ్మాస్త్రం సీ విజిల్: ఎస్పీ చందనా దీప్తి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంబంధించిన సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ప్రజలు సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. బాధ్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సి-విజిల్ యాప్ అన్నారు.
Similar News
News January 14, 2025
NLG: మరో 12 రోజులే.. దగ్గర పడుతున్న గడువు!
మునిసిపల్ పాలకవర్గాల గడువు దగ్గర పడుతోంది. SRPT జిల్లాలో నేరేడుచర్ల, HZNR, KDD, SRPT, తిరుమలగిరి, NLG జిల్లాలో నందికొండ, NLG, NKL, MLG, HLY, DVK, CTL, CDR, యాదాద్రి BNG జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, CPL, BNG, ఆలేరు మున్సిపాలిటీల పదవీకాలం ఈనెల 26తో గడువు ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 14, 2025
25 నుంచి జాన్‌పహాడ్ ఉర్సు.. దర్గా చరిత్ర ఇదే
ఈ నెల 25నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న ఈ దర్గాకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారని అంటున్నారు. మత సామరస్యానికి జాన్ పహాడ్ సైదన్న దర్గా ప్రతీక. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం. కాగా ఈ దర్గాకు నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వెళ్లొచ్చు.
News January 14, 2025
NLG: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.