News March 22, 2024

పౌరులకు అందుబాటులో ‘సి విజిల్‌’ యాప్‌

image

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ‘సి విజిల్‌’ యాప్‌ ద్వారా ఎన్నికల వేళ ఎవరు నిబంధనలు ఉల్లంగించిన ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

Similar News

News September 13, 2024

VZM: నర్సింగ్ చేసిన వారికి గుడ్ న్యూస్

image

ANM, GNM,BSC నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాష నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గోవిందరావు తెలిపారు. ఆరు నెలల శిక్షణ కోసం రూ.3.50 లక్షలు చెల్లించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50వేలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.శిక్షణ అనంతరం జపాన్ దేశంలో నెలకు రూ.లక్ష దాటి జీతం పొందవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://shorturl.at/FB7ok వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలన్నారు.

News September 13, 2024

VZM: రాష్ట్రస్థాయి యోగాసనాలకు 30 మంది ఎంపిక

image

49వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు 30 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. యోగా క్రీడా శరీరానికి, మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోకరమని, అందుకే దేశ ప్రధాని మోదీ సైతం ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

News September 13, 2024

విజయనగరం: ఈ నెల 16న గ్రీవెన్స్ రద్దు

image

ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ సమస్యలపై అర్జీలు అందించడానికి వచ్చే ప్రజలు ఈ విషయం గమనించాలని సూచించారు.