News August 8, 2024

పౌరుషాల జిల్లా.. మన మెదక్ ‘ఖిల్లా’

image

రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా నాటి ఆనవాళ్లు మాత్రం ఇంకా మన రాష్ట్రంలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. నేటికీ నిలిచిన పురాతన కట్టడాలు, కోట గోడలు, బురుజులు మెదక్ జిల్లా రాచరిక పాలనకు, పౌరుషానికి దర్పణం. నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా చెప్పుకునే మెదక్ ‘ఖిల్లా’ పట్టణానికి ఓ మణిహారంగా నిలిచింది. రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది. ఈ కోటకు మీరు వెళ్లారా.. వెళ్తే మీ అనుభవాలను పంచుకోండి.

Similar News

News September 16, 2024

సిద్దిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఎక్కువగా కురిసిందని తెలిపారు.

News September 15, 2024

సంగారెడ్డి: అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈవో

image

ఇన్‌స్పైర్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఇన్‌స్పైర్‌కు దరఖాస్తు చేయని విద్యార్థులు గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని సూచించారు.

News September 15, 2024

దుబ్బాక: చెరువులో పడి బాలుడి మృతి

image

దుబ్బాక మండలం అప్పనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి అప్పనపల్లి తల్లిగారింటికి వచ్చింది. తల్లి రేణుక, మరదలు కావ్య, కుమారుడు సాయి (7)తో కలిసి నవీన చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న సాయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.