News February 26, 2025
పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్

సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. గతంలో ఆయన నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ మొదటి అధికారిగా పనిచేశారు. ఇకనుంచి సంగారెడ్డి పౌర సరఫరాల మేనేజర్‌గా పూర్తి బాధ్యతలు వహించనున్నారు.
Similar News
News October 31, 2025
BREAKING: భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.
News October 31, 2025
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. NZB(D) నందిపేటలో కేదారేశ్వర ఆశ్రమాన్ని దర్శించనున్నారు. అనంతరం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కామారెడ్డి సఖి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫరీద్‌పేట ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News October 31, 2025
3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


