News March 25, 2025
ప్యాపిలి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన ఐఐటీ స్టూడెంట్ అరుణ్ కుమార్ పంజాబ్లో ఈ నెల 15న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోలుకోలేక నిన్న మృతి చెందాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పంజాబ్లో ఐఐటీ చదువుతున్న అరుణ్ క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.
Similar News
News November 28, 2025
కడప: రైతు కంట నీరు.. నష్టం నమోదుకు అడ్డంకులు

జిల్లాలో నాలుగు రోజుల కింట కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు అంటున్నారు. చేలల్లోనే ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అధికారులు నమోదు చేయడం లేదని వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇంకా తమకు లాగిన్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.
News November 28, 2025
ASF: లోకల్ ఎలక్షన్స్.. అభ్యర్థుల వేట

ఆసిఫాబాద్ జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశాయి. ఆర్థిక బలం, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులను రంగంలోకి దించాలని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ, గ్రామాల్లో తమ పట్టును నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకంగా మారనుంది.
News November 28, 2025
NLG: తొలిరోజు భారీగా నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 775 మంది నామినేషన్లు దాఖలు చేయగా వార్డు మెంబర్లకు 384 మంది నామినేషన్లు వేశారు. NLG జిల్లాలో మొత్తం 318 జీపీలకు 363 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. SRPT జిల్లాలో 207 మంది, యాదాద్రి జిల్లాలో 205 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.


