News March 20, 2025
ప్యాపిలి: స్కూల్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు

ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ యం.బొజ్జన్న విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు చెప్పారు.
Similar News
News November 22, 2025
టాస్క్ఫోర్స్ అదనపు SPగా కులశేఖర్ బాధ్యతలు

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్(RSSTF)అదనపు SPగా జె.కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి ASPగా పనిచేసిన ఈయన్ను తాజాగా టాస్క్ఫోర్స్కు అటాచ్ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన టాస్క్ఫోర్స్ హెడ్, తిరుపతి SP సుబ్బారాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 22, 2025
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

సింగరేణి సీఎండీ బలరామ్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి త్వరలో వాట్సాప్ నెంబరును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎండీ వెల్లడించారు.
News November 22, 2025
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


