News February 6, 2025
ప్రకాశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
Similar News
News October 27, 2025
శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.
News October 27, 2025
తుఫాన్ హెచ్చరిక.. మండలాలకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం!

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముందస్తు చర్యలలో భాగంగా తీర ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను ఆదివారం నియమించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయగా తీర ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోలీస్ అధికారులను నియమించారు.
News October 27, 2025
ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి రెండు రోజులు సెలవులు

మొంథా తుఫాను సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ కళాశాలలకు అక్టోబర్ 27, 28వ తారీఖున సెలవుదినంగా ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగు అవగాహన, జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ అధికారులు కోరారు. సెలవు ప్రకటించిన విషయాన్ని అందరూ గమనించాలని సంబంధిత అధికారులు సూచించారు.


