News January 10, 2026
ప్రకాశంలో నేడు, రేపు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.
Similar News
News January 24, 2026
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. చీమకుర్తి, దర్శి, పొదిలి ప్రాంతాలలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News January 24, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ‘ఎస్పీ మీకోసం’ కార్యక్రమం రద్దు: SP

జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు, ఆయా జిల్లాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News January 24, 2026
ప్రకాశం: స్కూల్ బస్సు ఢీ.. వ్యక్తి స్పాట్‌డెడ్

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఉల్లగల్లుకి చెందిన తప్పెట చిన్ని ఒంగోలులో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య రాజ్యంతో కలిసి స్కూటీపై ఉల్లగల్లులోని బ్యాంకు పని చూసుకోని వెళ్తున్నారు. శంకరాపురం- తిమ్మాయపాలెం మధ్యలో స్కూల్ బస్ స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో చిన్ని అక్కడికక్కడే చనిపోయాడు. రాజ్యానికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.


